రంజాన్ పండుగ ప్రేమ, శాంతి, సౌభ్రాతృత్వానికి ప్రతీక అని జనసేన పార్టీ నాయకులు మండలనేని చరణ్‌తేజ చెప్పారు. కఠినమైన ఉపవాస దీక్షలు ముగించుకుని రంజాన్ పండుగ జరుపుకుంటున్న ముస్లిం సోదరులకు చరణ్‌తేజ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.ఈ పండుగ లౌకిక వాదం, మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ముస్లింమైనార్టీల అభివృద్ది సాధ్యమౌతుందని, ఆ దిశగా ప్రభుత్వం అనేక సంక్షేమాభివృద్ది పథకాలు రూపొందించిందని వెల్లడించారు. అల్లాహ్ ఆశీర్వాదాలతో తలపెట్టిన ప్రతి పని విజయవంతం కావాలని, ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో తులతూగాలని ఆకాంక్షించారు.
Monday, March 31, 2025
- Blogger Comments
- Facebook Comments
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment