సీనియర్ పాత్రికేయులకు ఘన సన్మానం
*అక్రిడేషన్ తో పని లేకుండా ఆరోగ్య భీమాలో అవకాశాలు కల్పించాలి*.
*రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షలతో గృహ నిర్మాణం చేపట్టి ఇవ్వాలి*.
స్థానిక పాత్రికేయుల కుటుంబాలకు (ఐఎంఏ) ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నాయకులు ఉచితంగా వైద్యం చేయించుకునే అవకాశాలు కల్పించాలి.
చిలకలూరిపేట: నిజాన్ని నిర్భయంగా,నిస్వార్థంగా తమ గళంతోనూ, కలంతోనూ ప్రపంచానికి తెలియజేస్తూ ప్రజలను చైతన్యపరుస్తున్న పాత్రికేయ మిత్రులకు ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవ శుభాకాంక్షలను తెలుగు జర్నలిస్టు సంక్షేమ సంఘం నాయకులు తెలిపారు.పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో ఏలూరి సిద్దయ్య విజ్ఞాన కేంద్ర మందిరంలో ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. సీనియర్ పాత్రికేయులు షేక్ అల్లా బక్షు, పిట్టల శ్రీనివాసరావులను ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా కార్యక్రమని ఉద్దేశించి నాయకులు మాట్లాడుతూ పత్రికా స్వేచ్ఛ హక్కులను కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు హరించి వేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వాలు వాస్తవ సమాచారాలను అనుసరించి, సీనియర్ పాత్రికేయులను గుర్తించి అవార్డులు, రివార్డులు ఇవ్వలన్నారు. గత ప్రభుత్వంలో పత్రికలు, పాత్రికేయుల పైన వారి హక్కులను భంగం కలిగించే విధంగా జీవోలను తెచ్చారన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఆ విధంగా చేయకపోవడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. పాత్రికేయులకు ఎటువంటి ఆంక్షలు లేకుండా... అక్రిడేషన్ తో పని లేకుండా...నివేశన స్థలాలు ఇచ్చి రూ.10 పది లక్షలతో గృహ నిర్మాణాలు చేపట్టి ఇవ్వాలన్నారు. అదేవిధంగా ఆరోగ్య భీమాకు అక్రిడేషన్ తో పని లేకుండా పత్రికా రంగంలో పని చేస్తున్న ప్రతి ఒక్క పాత్రికేయులకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక పాత్రికేయుల కుటుంబాలకు (ఐఎంఏ) ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నాయకులు ఉచితంగా వైద్యం చేయించుకునే అవకాశాలు కల్పించాలన్నారు.ఈకార్యక్రమంలో
తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి బి.శ్రీను నాయక్, తుర్లపాటి వెంకట నగేష్, కొండ్రముట్ల నాగేశ్వరరావు, చెన్నకేశవుల రాంబాబు, సలికినీడి నాగరాజు, రాంబాబు నాయక్, ఆనంద్, గోపి నాయక్, హరిబాబు, కంచర్ల శ్రీనివాసరావు తోపాటు పలువురు పాత్రికేయులు ఇతర ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment