ఎడ్లపాడు మండలం పరిధిలోని దింతన పాడు గ్రామంలో సర్పంచ్ దేవరపు సుమతి అధ్యక్షతన మరియు 8 వార్డ్ మెంబర్ కొచ్చర్ల శ్వేత ఆధ్వర్యంలో రానున్న క్రిస్మస్ పండుగ సందర్భంగా ఎస్సీ కాలనీ నందు ఈరోజు డ్రైనేజీ కాలవలు పూడిక తీయడం జరిగినది. ఈ సందర్భంగా సర్పంచ్, వార్డ్ నెంబర్ మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో బాగా జరుపుకోవాలని నిర్ణయించుకుని గ్రామంలోనే ముందుగా కాలువలో పూడిక తీసివేయడం మరొక రోజు రోడ్డుకిరువైపులా పరిశుభ్రం చేయుట నిర్ణయించామని మరియు చలిజ్వరాలు, అంటు వ్యాధులు ప్రబలకుండా శానిటేషన్ భాగంగా రోడ్డుకిరువైపులా కాలువలపై బ్లీచింగ్ చెల్లిస్తానని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రెటరీ శోభన్ శోభన్ శంకర్ మరియు గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment